ఆర్టీసీలో జాబ్‌లకు నేటి నుంచే దరఖాస్తులు…!

కెరీర్ తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ఆర్టీసీలో జాబ్‌లకు నేటి నుంచే దరఖాస్తులు…!
– శ్రామిక్, డ్రైవర్ల పోస్టులకు అప్లికేషన్ల స్వీకరణ
– అర్హతలు, దరఖాస్తుల విధానం తెలుసుకోండి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్‌ పోస్టుల భర్తి కోసం చేపట్టే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటినుంచి మొదలు కానుంది. . ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు నేటి నుంచి 28 వరకు దరఖాస్తు గడువు తేదీగా నిర్ణయించారు. ఆర్టీసీలో 1000 డ్రైవర్‌, 743 శ్రామిక్‌ పోస్టులు భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో ఇదివరకే పేర్కొన్నారు. డ్రైవర్‌ పోస్టులకు 22 నుంచి 35ఏళ్లు, శ్రామిక్ పోస్టులకు 18నుంచి 30ఏళ్ల వయసు వారు అర్హులని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరి వారికి 5 ఏళ్లు, ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ అయితే 3ఏళ్లు వయో పరిమితి సడలింపు ఉంటుందని బోర్డు తెలిపింది.
kvcs
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్లు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఒక ప్రకటనలో పేర్కొంది. ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తులో తమ కుల ధ్రువీకరణ పత్రాలను ఎస్సీ ఉపకులాల వర్గీకరణ వారీగా కొత్త ఫార్మాట్‌లోనే జత చేయాలని మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు సూచించారు. ఒకవేళ దరఖాస్తు సమయంలో దీనిని జత చేయకుంటే.. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయంలో తప్పనిసరిగా అందజేయాలని సూచించారు. స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం www.tgprb.inలో చూడాలని పోలీసు నియామక మండలి తెలిపింది.

ఇదికూడా చదవండి…

 

కమలంలో.. కల్లోలం..!