శ్రీ వశిష్ట విద్యార్థులు భళా..!

కెరీర్ తాండూరు వికారాబాద్ హైదరాబాద్

శ్రీ వశిష్ట విద్యార్థులు భళా..!
– నీట్‌లో అదరగొట్టిన స్టూడెంట్స్‌
– ప్రతిభ కనబరిచిన తాండూరు వాసులు
– ఉచితంగా ఎంబీబీఎస్ సీట్లకు ఎంపిక
హైదరాబాద్/తాండూరు, దర్శిని ప్రతినిధి : హైదరాబాద్‌లోని శ్రీ వశిష్ట జూనియర్ కాలేజీ విద్యార్థులు భళా అనిపించారు. కళాశాల నుంచి జేఈఈ మేయిన్స్ తో పాటు నీట్‌లో సత్తా చాటారు. భవిష్యత్తు ఇంజనీర్లుగా, ఐఐటీలు, వైద్యులుగా, వ్యవస్థాపక నిర్మాతులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా శ్రీ వశిష్ట కాలేజీ కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో టాప్ ఇంజనీరింగ్, ఐఐటీ, నీట్ కోర్సులలో ఉత్తమ విద్యను అందిస్తూ 82శాతం సీట్ల భర్తితో మెరుగైన విద్యను అందిస్తున్న విద్యాసంస్థల్లో ముందు వరుసలో నిలుస్తోంది. ఈ కాలేజీలో వికారాబాద్‌ జిల్లా తాండూరు నుంచి విద్యను అభ్యసించిన విద్యార్థులు ఇటీవల జరిగిన నీట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఉచితంగా ఎంబీబీఎస్ సీట్లను సాధించారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణంకు చెందిన వ్యాపారి చంద్రకాంత్ శెట్టి కూతురు స్నిగ్ద శెట్టి నీట్‌లో సత్తా చాటింది. దీంతో ఆమెకు వనపర్తి జిల్లా జీఎంసీ మెడికల్‌ కాలేజీలో ఉచితంగా ఎంబీబీఎస్ సీట్‌కు ఎంపికైంది. అదేవిధంగా తాండూరు పట్టణం గ్రీన్ సీటి కాలనీకి చెందిన పాల వ్యాపారి గోపాల్ రెడ్డి కూతురు కూడా శ్రీ వశిష్ట నుంచి నీట్ పరీక్షల్లో సత్తా చాటింది. ఆమెకు ఆషిఫాబాద్ జీఎంసీ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ సాధించింది.
kvcs
అదేవిధంగా తాండూరు పట్టణం సాయినగర్‌కు చెందిన టీచర్ శివకుమార్ కూతురు దుబ్బాస్ పల్లవి కూడా నీట్‌లో సత్తా చాటింది. దీంతో ఆమెకు జీఎంసీ ఉస్మానియా కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ వరించింది. తాండూరు పట్టణం పాతకుంటకు చెందిన టీచర్ నాగరాజు కులకర్ణి కుమారుడు శ్రీపాద్ కులకర్ణి కూడా నీట్‌ పరీక్షల్లో ప్రతిభను చాటి జీఎంసీ నల్గొండ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ సాధించారు. వీరితో పాటు కోడంగల్ నియోజకవర్గం రేగడి మైలారంకు చెందిన వెంకటప్ప కూతురు గుంజ అక్షర కృప కూడా నీట్‌లో మెరిసి ఉత్తమ ర్యాంకు సాధించడంతో ఆమెకు గాంధీ మెడికల్ కాలేజీలో ఉచితంగా ఎంబీబీఎస్ సీటను సాధించింది. తాండూరు ప్రాంతానికి చెందిన విద్యార్థులు నీట్ పరీక్షల్లో సత్తా చాటడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరచడంతో శ్రీ వశిష్ట కాలేజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లింగమనేని ప్రమీలా రాణి సంతోషం వ్యక్తం చేశారు. తమ కాలేజీ నుంచి ఉత్తమ ఐఐటీలు, వైద్యులు, ఇంజనీర్లుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే తమ ధ్యేయమన్నారు. మరోవైపు డీన్ రాజు, కళాశాల ప్రతినిధులు శ్రీనివాస్ గౌడ్, వెంకట్ రెడ్డిలు కూడా విద్యార్థులను అభినందించారు.

ఇదికూడా చదవండి…

బైపాస్ రోడ్డుకు మహర్ధశ..!