కష్టపడి చదివి ప్రయోజకులు కావాలి
– తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
– ఉత్సహంగా శాలివాహాన కాలేజీ ఫ్రెషర్స్ డే
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు కష్టపడి.. చదివితే ప్రయోజకులు అవుతారని, అనుకున్న లక్ష్యాలను ఇష్టపడి సాధించుకోవచ్చని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని శాలివాహన డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే సమయంలో కొన్ని ఇష్టాలను దూరం చేసుకోవాలని అన్నారు. కసితో.. కష్టపడి చదువుకుంటే ఉన్నస్థాయికి ఎదుగుతారని అన్నారు. లక్ష్యాలను నెరవేర్చుకుని ప్రయోజకులు అయినప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. తల్లిదండ్రులకు, కాలేజీకి మంచి పేర్లు వాటంతంటా అవే వస్తాయన్నారు.

మరోవైపు ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థులు పలు నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. వేడుకలలో ఉత్స హాంగా పాల్గొని సందడిగా గడిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ మోముల మాణిక్యం, డైరెక్టర్లు బంటారం సుధాకర్, నాగారం మల్లేశం, బసంత్, రాధమ్మ, అకాడామిక్ డైరెక్టర్ సిద్దిలింగయ్య, ప్రిన్సిపల్ శరత్ చంద్ర, అద్యాపకులు, సిబ్బంది. విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

