ఈ ఐడియా మీ జీవితాన్ని మారుస్తుంది..!
– రోజుకు రూ. 3వేలు సంపాదించే అవకాశం
– పల్లెటూరి వాళ్లకు సూపర్ బిజినెస్ ఐడియా
దర్శిని డెస్క్ : స్వయం ఉపాధిలో రాణించాలంటే పెద్ద పెద్ద వ్యాపారాలే చేయనక్కర్లేదు. చిన్న చిన్న ఐడియాలు, అవకాశాలతో సరిపడా డబ్బులు సంపాదించవచ్చు. దానికి చేయాలనే అసక్తి, డబ్బు సంపాదించాలనే పట్టుదల ఉంటే చాలు. సరే ఇప్పుడు మనం విషయాని వద్దాం. ఈ ఐడియా పల్లెటూర్లలో ఉండే వారికి చాలా మందికి ఉపయోగపడొచ్చు. వాళ్లకే ఎందుకంటే.. పల్లెటూర్లలోనే వ్యవసాయంకు రాజయోగం ఉంది కాబట్టి.

వ్యవసాయంపై ఆధారపడి నెలకు రూ.లక్ష సంపాదించవచ్చు అంటే మీరు నమ్ముతారా? నిజం అలాంటి ఓ అద్భుతమైన బిజినెస్ ఐడియా ఒకటి ఉంది. వ్యవసాయ పనులు చేసేందుకు కొన్నేళ్లుగా కూలీల కొరత ఏర్పడుతోంది. ఇతర ప్రాంతాల నుంచి రైతులు కూలీలను పెద్ద సంఖ్యలో తీసుక వస్తున్నారు. అయినా కూడా ఇక్కడి రైతులు సమయానికి కూలీలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇదే కొరతను మీరు బిజినెస్ ఐడియాగా మార్చుకోవచ్చు. పొలాల్లో పురుగు మందులను మీరు డ్రోన్ సాయంతో పిచికారి చేస్తూ మంచి ఆదాయం పొందవచ్చు.

రోజుకు రూ.3వేలు అయినా నెలకు లక్ష
ఓ రూ.4 లక్షల నుంచి ఈ డ్రోన్ ధరలు ఉంటాయి. ఒక ఎకరం పొలానికి పురుగు మందులు పిచికారి చేస్తే అన్నీ ఖర్చులు పోనూ ఓ రూ.300 మిగులుతాయి. అలా రోజుకే పది ఎకరాలు చేసినా.. రోజుకు రూ.3000, నెలకు రూ.90 వేల ఆదాయం పొందవచ్చు. పల్లెటూర్లో ఉంటూ నెలకు రూ.90 వేల సంపద అంటే మాటలు కాదు. ఆ డ్రోన్ ఆపరేటింగ్ పెద్ద కష్టం ఏమీ కాదు. డ్రోన్ అమ్మేవారు అది ఎలా నడపాలో ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో.. మీకు ఆసక్తి ఉంటే ఈ బిజినెస్ గురించి మరింత సమాచారం తెలుసుకొని రంగంలోకి దూకండి.

ఇదికూడా చదవండి…

