బ్రౌన్‌ రైస్‌తో బొలేడు లాభాలు..!

ఆరోగ్యం జాతీయం టెక్నాలజీ తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

బ్రౌన్‌ రైస్‌తో బొలేడు లాభాలు..!
– మధుమేహం ఉన్నవారికి ఎంతో మంచిది
– గుండెకు, చెడు కొలెస్ట్రాల్‌ నుంచి రక్షణ
– మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి
దర్శిని డెస్క్ : అందరు తెల్లబియ్యం వండుకుని తింటుంటారు. అయితే బ్రౌన్‌ రైస్‌లో కూడా ఆరోగ్య పోషకాలు ఉన్నాయని, తెల్ల బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్ తినడం వల్ల వాస్తవానికి ఏవైనా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనొ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బ్రౌన్ రైస్‌లో విటమిన్ బి, మెగ్నీషియం, భాస్వరం, సెలీనియం, మాంగనీస్ వంటి బహుళ పోషకాలు ఉంటాయి. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు.

బ్రౌన్ రైస్‌లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ బియ్యం తినడం వల్ల జీర్ణం కావడం సులభం. డైటరీ ఫైబర్ తో బ్రౌన్ రైస్ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది అజీర్ణ సమస్యను తొలగిస్తుంది. బ్రౌన్ రైస్ మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో కూడా ఉపయోగపడుతుంది. అందుకే మలబద్ధకం సమస్యలు ఉన్నవారు బ్రౌన్ రైస్‌ను తీసుకోవచ్చు. ఈ రైస్‌ మధుమేహం ఉన్నవారికి ఎంతో మంచిదంటున్నారు నిపుణులు.
kvcs

బియ్యం తింటే లావు అవుతారనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. అందుకే చాలా మంది తెల్ల బియ్యం కాకుండా బ్రౌన్ రైస్ తింటారు. బ్రౌన్ రైస్ తినడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో, తెల్ల బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్ తినడం వల్ల వాస్తవానికి ఏవైనా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా అని తెలుసుకోవడం విలువైనది. రక్తపోటు స్థాయి తక్కువగా ఉండి, చెడు కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉంటే, గుండె ఆరోగ్యానికి అంత మంచిది. బ్రౌన్ రైస్ రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో, తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

ఇదికూడా చదవండి…

కుక్కల దాడిలో మేకలు బలి