ఆధార్ అప్‌డేట్‌లో అతిపెద్ద మార్పు..!
– ఇక నుంచి డిజిటల్ పద్దతిలో అప్‌డేటింగ్
– సెంటర్లకు వెళ్లకుండా చేసుకునే అవకాశం
– ఇప్పటికే కొత్త ఫీజులు అమలు
దర్శని డెస్క్ : రేపటి నుంచి ఆధార్ అప్‌డేట్‌లో అతిపె్ద మార్పు రాబోతుంది. ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే పూర్తిగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునే సౌకర్యాన్ని UIDAI అందుబాటులోకి తేనుంది. ఈ కొత్త విధానం అప్‌డేట్‌లో కేవలం ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే పూర్తిగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునే సౌకర్యాన్ని UIDAI అందుబాటులోకి తేనుంది.

నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న అతిపెద్ద మార్పు ఏమిటంటే.. జనాభా వివరాల అప్‌డేట్ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరగనుంది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల వారికి, చిన్న పట్టణాల వారికి ప్రతి చిన్న మార్పు కోసం కిలోమీటర్లు ప్రయాణించి ఆధార్ కేంద్రాల ముందు క్యూలో నిలబడాల్సిన అవసరం తప్పనుంది. పేరు, అడ్రస్ వంటి జనాభా వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. కానీ ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ వంటి బయోమెట్రిక్ అప్‌డేట్స్ కోసం మాత్రం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది.

పెరిగిన అప్‌డేట్ ఫీజులు..
జూన్ 14 వరకు ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్లు ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం ముగిసింది. ఇప్పుడు అన్ని అప్‌డేట్‌లకు ఫీజు వర్తిస్తుంది. అక్టోబర్ 1 నుంచే అప్‌డేట్ ఫీజు కొద్దిగా పెరిగింది. చిన్న మార్పుకైనా (పేరు, అడ్రస్) ఇప్పుడు రూ. 75, బయోమెట్రిక్ మార్పులకు రూ. 125 చెల్లించాలి. పిల్లలకు ఫ్రీ: 7 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న పిల్లల ఫింగర్ ప్రింట్స్, బయోమెట్రిక్ మార్చడానికి అయ్యే ఖర్చును UIDAI ఉచితం చేసింది. ఈ ఫీజుల వివరాలను ఆధార్ సెంటర్లలో ప్రదర్శించాలని స్పష్టం చేసింది. ఏవరైనా అధిక ఫీజులు వసూలు చేస్తే 1947 కాల్ చేసి… help@uidai.gov.in కు మెయిల్ చేసి.. https://resident.uidai.gov.in/file-complaint వెబ్సైట్ లోకి వెళ్ళి ఫిర్యాదు చెయ్యవచ్చని తెలిపింది.

ఇదికూడా చదవండి…

