పౌష్టికహారంతో టీబి నియంత్రణ

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

పౌష్టికహారంతో టీబి నియంత్రణ
– డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. రవీంద్ర యాదవ్….
– తాండూరులో టీబి బాధితులకు న్యూట్రీషన్ కిట్ల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : పౌష్టికాహారం తీసుకోవడం వల్ల టీబీని నియంత్రించడం సాధ్యమవుతుందని వికారాబాద్‌ జిల్లా డిప్యూటీ డీఎంహచ్ఎఓ డా.రవీంద్ర యాదవ్ అన్నారు.

శుక్రవారం తాండూరులో అదాని కంపెనీ ఆధ్వర్యంలో టీబీ, బాధితులకు న్యూట్రీషన్ కిట్లను పంపిణీ చేశారు. డిప్యూటీ డీఎంహెచిఓ రవీందర్ యాదవ్ సార్ హాజరై బాధితులకు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ బారిన పడిన బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
kvcs
సరైన సమయంలో వ్యాధులను గుర్తించి చికిత్సలు తీసుకుంటే నయం చేసుకోవచ్చన్నారు. అదేవి ధంగా బాధితులు పోషక విలువలు ఉన్న పౌష్ఠికాహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెంపొందుతుందన్నారు. తద్వారా వ్యాధులను నియంత్రించడం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ డా. రవీంద్ర యాదవ్, అదాని కంపెనీ హెచ్ ఓ డి నాగరాజ్. మరియు సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సర్దార్ కృషితో దేశ సమైక్యత