ఫీజు బకాయిలపై రాజకీయాలు ఆపండి
– వెంటనే రియంబర్స్ మెంట్ ఫీజులు విడుదల చేయాల్సిందే
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
– తాండూరులో విద్యార్థులతో మహాదర్నా
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలపై రాజకీయాలు ఆపాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. శనివారం బీసీ సంఘం ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో విద్యార్థులతో కలిసి మహా దర్నా నిర్వహించారు.

విద్యార్థులు అంబేద్కర్ విగ్రహం ముందు బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కందుకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ పేద విద్యార్థుల చదువుల కోసం ఆర్. కృష్ణయ్య నిరంతర ఉద్యమాలు చేశారని, దాని ఫలితంగా ఫీజు రియంబర్స్ మెంట్ విధానం అమల్లోకి వచ్చిందన్నారు. గత ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్ మెంట్ పై నిర్లక్ష్యం చేయడంతో బకాయిలు పేరుకుపోయాయని అన్నారు.

ఈ బకాయిల వల్ల కళాశాలల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలపై ప్రభుత్వాలు రాజకీయాలు ఆపాలని అన్నారు. వెంటనే విద్యార్థులకు ఫీజు రియంబర్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మహిళ నాయకులు అనిత, మంజుల, నర్సమ్మ, విజయలక్ష్మీ, వీరమణి, యాలాల మండల అధ్యక్షులు లక్ష్మణ్ చారి, మీడియా ఇంచార్జ్ బసవరాజ్, నాయకులు అబ్బని బసయ్య, యువ నాయకులు రమేష్, పరమేష్, యాసర్, మధుసుధన్, కార్తీక్, కిరణ్, వినయ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

