ఆర్టీసీ దుర్ఘటన ప్రభుత్వం తప్పే..!
– రోడ్డు గురించి ముఖ్యమంత్రికి తెలియదా..?
– ఆయన మాత్రం బందోబస్తులో భద్రంగా వెళ్లిస్తారు.
– మృతులకు ప్రతి ఒక్కరికి రూ. 1కోటి ఇవ్వాలి
– గాయపడిన వారికి రూ.10లక్షల పరిహారం
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత
– పేర్కంపల్లి ముగ్గురు అక్కాచెల్లెళ్ల కుటుంబానికి పరామర్శ
తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల వద్ద జరిగిన ఆర్టీసీ ప్రమాదం ముమ్మాటికి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. చేవేళ్ల బస్సు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల సొంత ఊరు వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలం పేర్కంపల్లి గ్రామాన్ని శుక్రవారం కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఆక్కాచెల్లెళ్ల కుటుంబాన్ని పరామర్శించారు.

తండ్రి ఎల్లయ్య గౌడ్. తల్లి అంబికలను ఓదార్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ చేవెళ్ల మీర్జాగూడా వద్ద జరిగిన దుర్ఘటన యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని విషాదం నింపిందన్నారు. ఈ ప్రమాదం డ్రైవర్లను కాదని, ఖచ్చితంగా ప్రభుత్వం తప్పే అని అన్నారు. రోడ్డు మంజూరు అయిన తరువాత ఎన్జీటీలో పరిష్కారం లభించిన తరువాత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించడం వల్లే తప్పు జరిగిందన్నారు. ఆర్టీసీ ప్రమాదంలో 19 మంది చనిపోయిన తరువాత రోడ్డు పనులు ప్రారంభించడం సిగ్గుచేటన్నారు. ఇదే పని వారం ముందు చేపట్టి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు.

ముఖ్యమంత్రి మాత్రం భద్రంగా వెళ్లోస్తారు
వికారాబాద్ జిల్లా ఏర్పాటు తరువాత. రేడార్ కేంద్రం మంజూరు తరువాత ఈ మార్గంలో రద్దీ పెరిగిందన్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా రోడ్డు విస్తరణ చేపట్టకపోవడం విచారకరమన్నారు. ఈ రోడ్డు పరిస్థితి ముఖ్యమంత్రికి తెలియదా అని ప్రశ్నిస్తూనే.. ఆయన తెలుసు కాబట్టే 1000 మంది భద్రత మధ్య ఆయన వెళ్లి వస్తుంటారని అన్నారు. కోడంగల్ నియోజకవర్గానికి వెళ్లి వస్తుంటారని అన్నారు. పేద ప్రజలను యా మాత్రం పట్టించుకోని పరిస్థితి కనబబుతోందని అన్నారు. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముఖ్యమంత్రి, ప్రభుత్వం దృష్టిసారించాలని అన్నారు.
ప్రతి ఒక్కరికి రూ. 1కోటి పరిహారం ఇవ్వాలి
చేవేళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదం అనేక జీవితాలను అతలాకుతలం చేసిందని కవిత అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే జరిగిన దుర్ఘటనే తప్పా మరోకటి కాదన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారు ఉన్నారని అన్నారు. వారి మరణాలు కుటుంబాలను దుఖంలోకి నెట్టివేశాయని అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.7లక్షల పరిహారం అందించడాన్ని అభినందిస్తున్నామని అన్నారు. కాని ఈ పరిహారం సరిపోదని మృతి చెందిన ప్రతి ఒక్కరికి రూ. 1కోటి పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ప్రమాదంలో గాయపడిన వారు కూడా కూలీలు, పేదలు ఉన్నారని, వారికి కూడా రూ. 10లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు.

అక్కాచెల్లెళ్ల మరణం.. తెలంగాణ మొత్తం దుఖించింది
ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్కా చెల్లెళ్ల దుర్మరణంతో తల్లి దండ్రులకు తీరని దుఖాన్ని మిగిల్చిందని అన్నారు. ముగ్గురు కూతుళ్ల మరణం వారికి జీవిత కాలం శోఖాన్ని అందించిందని అన్నారు. ఆర్టీసీ మృతుల మరణం కేవలం తాండూరు, పేర్కంపల్లి మాత్రమే కాదు.. యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం దుఖించిందని అన్నారు. మృతుల కుటుంబాలకు మనోధైర్యం అందించాలని ఆకాంక్షించారు.

హాజీపూర్ అక్కా చెల్లెళ్లను అండగా ఉంటాం
అదేవిధంగా యాలాల మండలం పేర్కంపల్లి గ్రామానికి చెందిన బందెప్ప. లక్ష్మీలు కూడా ఆర్టీసీ ప్రమాదంలో మృతి చెందగా.. వారి కూతుళ్లు భవాని, శివలీలు అనాథులుగా మారారు. ఈ విషయంపై కవిత మాట్లాడుతూ అక్కా చెల్లెళ్లకు అండగా ఉంటామని అన్నారు. వారి చదువు, వసతి, ఇళ్లు ఇతర విషయాలపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడడం జరుగుతుందని అన్నారు. ఖచ్చితంగా వారి కుటుంబానికి కూడా అండగా ఉంటామన్నారు. కవిత వెంట తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, బీఆర్ఎస్ మహిళ నాయకురాలు శకుంతల దేశ్ పాండే, జాగృతి జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

