ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం..!
– స్టీరింగ్ రాడ్డు విరిగి మోరాయింపు
– ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. బస్సుకు స్టీరింగ్ రాడ్డు వి రిగిపోవడంతో మోరాయించింది. ఈ సంఘటన ఆదివారం జరిగింది.

తాండూరు ఆర్టీసీ డీపోకు చెందిన అద్దె బస్సు(టీఎస్ 34 టీఏ 5454) తాండూరు నుంచి మహబూబ్ నగర్కు సర్వీసు అందిస్తోంది. రోజు మాదిరిగానే ఈ బస్సు ఆదివారం ఉదయం ప్రయాణికులతో బయల్దేరింది. మార్గ మద్యలోని యాలాల మండలం లక్ష్మీనారాయణ పూర్ సమీపంలోకి రాగానే బస్సు స్టీరింగ్ రాడ్డు విరిగి పోయింది. బస్సు ఆగిపోయిన స్థలంలో గుంతల రోడ్డు కూడా ఉంది.
kvcs
స్టీరింగ్ రాడ్డు విరిగి ఎలాంటి దుర్ఘటన జరగకపోవడంతో బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు ముందుకు సాగక పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఫిట్ నెస్ లేని బస్సులను అధికారులు ఇంకెంత కాలం నడిపిస్తారని ప్రయాణికులు మండిపడ్డారు. ఇదేవిషయంపై అధికారులను వివరణ కోరితే స్టీరింగ్ రాడ్డు కాదు.. క్లచ్ రాడ్డు విరిగిందని చెప్పుకొచ్చారు.

ఇదికూడా చదవండి…

రోడ్లకు డబ్బుల్లేవ్..!