రైలు పట్టాల వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
– దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు
తాండూరు, దర్శని ప్రతినిధి : రైలు పట్టాల వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన తాండూరు రైల్వే పోలీస్టేషన్ పరిధి మంతట్టి రైల్వే స్టేషన్ యార్డు వద్ద జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఆదివారం ఉదయం స్టేషన్ సమీపంలో సుమారు 30 ఏండ్లు ఉన్న ఓ వ్యక్తి చనిపోయి ఉన్నట్లు గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వివరాలు తెలియరాలేదు.

మృతుడు నీలి రంగు జర్కిన్, ఆరెంజ్ కలర్ షార్ట్ ధరించి ఉన్నాడు. మృతుని ఒంటి పై ఎలాంటి గాయాలు కూడా కనిపించలేదు. దీంతో మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలిస్తే సెల్: 7702629707, 8712513584లకు సమాచారం అందించాలని రైల్వే పోలీసులు సూచించారు.

ఇదికూడా చదవండి…

