వేగవంతంగా అమృత్ స్టేషన్..!
– వచ్చే మార్చికి పూర్తి చేయడమే లక్ష్యం
– సికింద్రాబాద్ డీఆర్ఎం డా. ఆర్. గోపాల కృష్ణన్
– తాండూరులో అమృత్ పనుల పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ కింద తాండూరులో చేపడుతున్న రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగవంతం చేయడం జరిగిందని, వచ్చే యేడాది మార్చిలోగా పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు దక్షిణ మద్య రైల్వే శాఖ సికింద్రాబాద్ డీఆర్ఎం డా.ఆర్.గోపాల కృష్ణన్ అన్నారు.

తాండూరు రైల్వే స్టేషన్ ను అమృత్ భారత్ నిధులు రూ. 24 కోట్లతో ఆధునీకరిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం తాండూరులోని రైల్వే స్టేషన్ ను డీఆర్ఎం డా. గోపాల కృషన్ రైల్వే అధికారులతో కలిసి సందర్శించారు. అమృత్ భారత్ కింద తాండూరు రైల్వే స్టేషన్ లో చేపడుతున్న సర్కులేటింగ్ ఏరియా, కాన్ కోర్సు, స్టేషన్ భవనం, ప్లాట్ ఫారం, పార్కింగ్, ఎస్కలేటర్, లిపు తదితర పనుల దశలను సమీక్షించారు.

ఆయా పనులు ఏయే దశలో ఉన్నాయని రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల నిర్వహణలో ఏమైనా ఇబ్బందులు. సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. పనులు త్వరితగతిగా పూర్తి చేసేలా చూడాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడీయాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే యేడాది 2026 మార్చిలోగా తాండూరు రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. అప్పటిలోగా పనులు నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేసేందుకు దృష్టిసారిం జరుగుతుందన్నారు. దీంతో పాటు రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం.. సమస్యలు పరిష్కరించడంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ఇదికూడా చదవండి…

