దీపోత్సవంకు రండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

దీపోత్సవంకు రండి..!
– రేపు తాండూరు గోశాలలో కార్తీక దీపోత్సవం
– గోశాల సమితి ఆధ్వర్యంలో ఏర్పాట్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కార్తీక మాసం దీపోత్పవంకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలి తాండూరు గోశాల సమితి సభ్యులు కోరారు. కార్తీక మాసం సందర్భంగా తాండూరు గోశాలలో గోపూజ, దీపోత్సవ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.

ప్రతి యేడాది కార్తీక మాసం దీపోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని సభ్యులు గుర్తుచేశారు. ఇందులో భాగంగా ఈసారి కూడా దీపోత్సవ కార్యక్రమం, గోపూజలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు.
kvcs
పట్టణంలోని సీతారంపేట్‌లో ఉన్న గోశాలలో గురువారం సాయంత్రం 5-31గంటలకు కార్తీక దీపోత్సవం, గోపూజలు ప్రారంభమవుతాయని చెప్పారు. కావున భక్తులు, గోభక్తులు, పట్టణ ప్రముఖులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

వేగవంతంగా అమృత్ స్టేషన్..!