గొట్టిగ మహిపాల్ రెడ్డి యాదిలో..!

తాండూరు తెలంగాణ వికారాబాద్

గొట్టిగ మహిపాల్ రెడ్డి యాదిలో..!
– నివాళులు అర్పించిన మాజీ మంత్రి సబితారెడ్డి
– పూలువేసి స్మరించుకున్న నర్సింహారెడ్డి(బాబు)
– కోటబాస్పల్లిలో వర్థంతిలో పాల్గొన్న నేతలు, గ్రామస్తులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎంపీపీ స్వర్గీయ గొట్టిగ మహిపాల్ రెడ్డి 15వ వర్ధంతి కోటబాస్పల్లి గ్రామంలో జరిగింది.

బుధవారం మహిపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి సోదరుడు, ఇంద్రారెడ్డి చారిటబుట్ ట్రస్ట్ చైర్మన్, తాండూరు సిటీకేబుల్ ఎండీ నర్సింహారెడ్డి(బాబు) గ్రామంలోని స్మృతివనంలో తల్లిదండ్రుల సమాధి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు.
kvcs
అదేవిధంగా ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాత రెడ్డి, సోదరి సద్గుణ రెడ్డిలు హాజరై తండ్రి మహిపాల్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం తల్లి వెంకటమ్మ సమాధి వద్ద కూడా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మహిపాల్ రెడ్డి చేసిన సేవా కార్యక్రమాలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు కిష్టప్ప, నాగప్ప, బాబు అన్న సోదరుడు, యువ నాయకుడు గోట్టుగ రాజశేఖర్ రెడ్డి, చిన్న నాన్న గోట్టుగా రామిరెడ్డి,  రవి, శశిధర్, వివి రెడ్డి, సిహెచ్ అశోక్, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

దీపోత్సవంకు రండి..!