తాండూరు డీఎస్పీపై అటాచ్ వేటు..!
– డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ
– కొత్త డీఎస్పీ నియామకం కూడా పూర్తి
– బదిలీ వేటు వెనుక కారణాలు ఇవే…?
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డిపై వేటు పడడం పోలీసు శాఖలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

డీఎస్పీ బాలకృష్ణారెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడమే ఇందుకు కారణం. అంతేకాకుండా వెంటనే కొత్త డీఎస్పీ నియామకం కూడా చేపట్టినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం అయ్యింది. 2023 ఫిబ్రవరి 16న తాందూరు డీఎస్పీగా బాధ్య తలు చేపట్టిన కొత్త బాలకృష్ణారెడ్డి 21 నెలల పాటు విధులు నిర్వహించారు. సైబర్ నేరాలు, బాల్యవివాహాలను అరికట్టడంలో, పోక్సో కేసుల నివారణ. రోడ్డు ప్రమాదాల నియంత్రణ వంటి అనేక కార్యాక్రమాలపై వీడియో సందేశాల ద్వారా ప్రజలను చైతన్య పరిచారు.

మరోవైపు పలు కేసుల్లో అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. గత ఏడాది నవంబర్ 11న బగచర్లలో అధికారులపై దాడి జరిగిన ఘటన జరిగి ఏడాది పూర్తయినా కోర్టులో చార్డిషీటు దాఖలు చేయకపోవడంపై ఉన్నతాధికా రులు ఆయనపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే డీజీపీ కార్యాలయానికి అబాన్ చేసి నట్లు తెలుస్తోంది. మరోవైపు తాండూరు డీఎస్పీగా ఆయన స్థానంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ విజిలెన్స్‌లో డీఎస్పీగా పనిచేస్తున్న నర్సింగ్ యాదయ్యను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి…

