పిల్లలకు ఉచిత వైద్యం..!

ఆరోగ్యం టెక్నాలజీ తాండూరు తెలంగాణ రాజకీయం లైఫ్-స్టైల్ హైదరాబాద్

పిల్లలకు ఉచిత వైద్యం..!
– కాంగ్రెస్ సర్కారు మరో కొత్త పథకం
– వైకల్యం ఉన్న వారికి ఫ్రీగా ఆపరేషన్లు
– ఎలా అమలు చేయాలో కసరత్తు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న పిల్లల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. ఈ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందించడంతో వైకల్యం కలిగిన వారికి ఫ్రీగా ఆపరేషన్లు, మిషన్లు అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వ సహాకారంతో కూడా అమలు చేసేందుకు కసరత్తును ప్రారంభించింది. ఇక ఈ బాల భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయడానికి గాను తెలంగాణ సర్కార్.. కొత్త సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేస్తోంది. ఈ బాల భరోసా పథకం విజయవంతమైతే.. రాష్ట్రంలోని లక్షల మంది చిన్నారులకు చిన్న వయసులోనే మెరుగైన వైద్య సేవలు అంది… ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది పడుతుంది అంటున్నారు.

కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది సర్వే నిర్వహించి.. పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సుమారు 8 లక్షల మంది చిన్నారులను గుర్తించింది. తెలంగాణలో ఐదు సంవత్సరాలలోపు ఉన్న పిల్లల ఆరోగ్య భవిష్యత్తు కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు బాల భరోసా పథకం ద్వారా మెరుగైన వైద్యం ఉచితంగా అందించనున్నారు.
kvcs
చిన్నారులలో వయసుకు తగిన ఎదుగల లేక పోషకాహారలోపం, వైకల్యం, రక్తహీనత, వినికిడి, కంటిచూపు వంటి సమస్యలు ఉన్నట్లు సర్వేలో గుర్తించారు. ఈ చిన్నారులందరికీ ప్రభుత్వం ఉచిత వైద్యం అందించేందుకు బాల భరోసా పథకాన్ని ప్రారంభించబోతుంది. దీని ద్వారా వైకల్యంతో బాధపడే చిన్నారులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయడం.. వినికిడి లోపం ఉన్న వారికి మెషీన్లు అమర్చడంతో పాటు ఇతర వైద్య సేవలు కూడా అందిస్తారు.

మహిళా శిశు సంక్షేమశాఖ, వైద్య ఆరోగ్య శాఖలు సంయుక్తంగా బాల భరోసా పథకాన్ని అమలు చేయబోతున్నాయి. అలానే దీన్ని ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేయనున్నారు. అందువల్ల బాల భరోసా వర్తించని అనారోగ్య సమస్యలు, వ్యాధులుంటే.. వాటి చికిత్స కోసం సీఎం సహాయ నిధి నుంచి డబ్బులు చెల్లించేలా ప్రణాళికలు రెడి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రస్తుతం అమలు అవుతోన్న రాష్ట్రీయ బాల స్వస్థ్య (ఆర్‌బీఎస్‌కే) పథకాన్ని కూడా బాల భరోసాతో అనుసంధానం చేయబోతున్నారు.

ఇదికూడా చదవండి…

తాండూరు డీఎస్పీపై అటాచ్‌ వేటు..!