ఢిల్లీ దాకైనా పోదాం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఢిల్లీ దాకైనా పోదాం..!
– 42శాతం రిజర్వేషన్ల సాధనే ధ్యేయం
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
– తాండూరులో బీసీల ధర్మ పోరాట దీక్ష విజయవంతం
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీలకు 42శాతం రిజర్వేషన్లను సాధించుకునేందుకు ఢిల్లీ దాకా అయినా వెళ్లి పోరాడుదామని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీల ధర్మ పోరాట దీక్ష చేపట్టారు.

కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బీసీ నేతలు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీలకు 42శాతం రిజర్వేషన్లను సాధించుకువరకు నిరంతర ఉద్యమం చేద్దామని అన్నారు. రిజర్వేషను అమలు చేసే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే అని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకవచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకవచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి చొరవచూపాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. రిజర్వేషన్లను సాధించుకునేందుకు తాండూరు నుంచి ఢిల్లీ దాక అయినా పోరాటం చేసేందుకు బీసీలు సిద్ధంగా ఉండాలన్నారు.
kvcs
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మహిళ అధ్యక్షురాళ్లు, కార్యదర్శులు అనిత, మంజుల, నర్సమ్మ, విజయలక్ష్మీ, శివలీల, మండలాల అధ్యక్షులు చెన్నారం లక్ష్మణ చారి, శ్రావణ్ కుమార్, బసంత్ కుమార్, మీడియా ఇంచార్జ్ బసవరాజు, విద్యావంతుడు పర్యాద రామకృష్ణ, స్వేరోస్, వైఎఫ్ నాయకులు అరుణ్ రాజ్, శివ, నాయి బ్రాహ్మణ సమాజం సభ్యులు పరమేష్, ఆర్టీసీ నాయకులు, బీసీ సంఘం నాయకులు రాము ముదిరాజ్, మంతటి రాజు, పరమేష్, జోసఫ్, రాజు, ప్రవీణ్, పండుగౌడ్, దుబాయి వెంకట్, నర్సింహా, జగన్, నరహరి, కార్తీక్, కిరణ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

తాండూరులో ఫేక్ కరెన్సీ కలకలం..!