రోడ్ల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రోడ్ల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!
– తాండూరు – వికారాబాద్ రోడ్డు వేగవంతం చేయండి
– నీటి పారుదల ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ రోడ్ల అభివృద్ధి, నీటి పారుదల శాఖ ప్రాజెక్టుల పురోగతిపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.

గురువారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఆర్అండ్‌బీ అధికారులతో సమావేశం అయ్యారు. నియోజకవర్గంలో జరుగుతున్న పనులు, పెండింగ్ లో ఉన్న పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు వికారాబాద్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అన్నారు.
kvcs
నియోజకవర్గంలో వివిధ దశల్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా నియోజకవర్గంలో నీటి పారుదల ప్రాజెక్టులు, పెండింగ్ లో ఉన్న పనులను తర్వగా పూర్తి చేసేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యాలయంలో ఆర్అండ్‌బీ శాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ఢిల్లీ దాకైనా పోదాం..!