పోలీసు శాఖలో టెన్షన్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

పోలీసు శాఖలో టెన్షన్..!
– ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐల బదిలీ..?
– త్వరలో ఉత్తర్వులకు అవకాశంటూ ప్రచారం
– బదిలీనా, వేటు వేస్తారా అనేది అసక్తికరం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా పోలీసు యంత్రాంగంలో బదిలీల టెన్షన్ ఏర్పడింది. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డిపై ఉన్నతాధికారలు చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

తాజాగా తాండూరు సబ్ డివిజన్‌కు సంబంధించిన పోలీసులపై చర్యలు తప్పవనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ అధికారులను బదిలీ చేస్తారా.. లేదా వేటు వేస్తారా అనేది ఆసక్తికరంగా మారిందని చర్చించుకుంటున్నారు. తాండూరులో జరిగిన కొన్ని పరిణామాల వల్ల ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నారని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా తాండూరు కేంద్రంగా జరుగుతున్న అక్రమ కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయి.
kvcs
అక్రమ రేషన్ బియ్యం, ఎర్రమట్టి, ఇసుక రవాణా వంటి తదితర అంశాలలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తాండూరులో జరిగిన భారీ దొంగతనాల కేసుల్లో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతిని ప్రదర్శించకపోవడంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో పాటు పలు కేసుల్లో కూడా వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు రావడంతో దశల వారిగా అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాండూరులోని ఇద్దరు సీఐలు, పెద్దేముల్ ఎస్ఐ, బషీరాబాద్‌ ఎస్ఐల బదిలీ తప్పదని ప్రచారం జరగుతోంది. తాండూరులో కొత్త డీఎస్పీగా నేడు నర్సింగ్ యాదయ్య బాధ్యతలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇదికూడా చదవండి…

తాండూరులో పోలీసుల కార్డెన్ సెర్చ్