మౌళిక సదుపాయాలపై నిర్లక్ష్యం తగదు
– తాగునీరు, పారిశుద్ధ్యం నిర్వహణ సక్రమంగా జరగాలి
– తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి అన్నారు.

శుక్రవారం తాండూరు పట్టణంలోని శాంతినగర్, 28వ వార్డులో పర్యటించారు. కాలనీలో పర్యటించి పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, ఇతర మౌళిక వసతులపై ప్రజలతో మాట్లాడారు. అనంతరం పార్కులను పరిశీలించారు. పార్కులలో పారిశుద్ధ్యంపై దృష్టిసారించాలన్నారు.

అదేవిధంగా కాలనీలలో ప్రజలకు మౌళిక సదుపాయాల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ దీపాలు వంటి వాటిపై ప్రజలు అందించిన ఫిర్యాదులను వెను వెంటనే పరిష్కరించేలా చూడాలన్నారు. ఇందులో నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇను స్పెక్టర్లు ఉమేష్, వెంకటయ్య, ఆస్ఐ రాములు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, జవాన్లు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

