తాండూరు డీఎస్పీగా నర్సింగ్ యాదయ్య

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు డీఎస్పీగా నర్సింగ్ యాదయ్య
– కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా నర్సింగ్ యాదయ్య బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన బాలకృష్ణారెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.

ఆయన స్థానంలో పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ డీఎస్పీగా పనిచేస్తున్న నర్సింగ్ యాదయ్యను నియమిస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం ఆయన తాండూరు డీఎస్పీగా విధుల్లో చేరారు. డీఎస్పీ బాలకృష్ణారెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించి.. కొత్త డీఎస్పీగా చార్జ్ తీసుకున్నారు.
kvcs
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. తాండూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నర్సింగ్ యాదయ్యకు తాండూరు సబ్ డివిజన్ సీఐలు, ఎస్ఐలు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

మౌళిక సదుపాయాలపై నిర్లక్ష్యం తగదు