పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– రూ.1.20 కోట్ల కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో తాండూరు మున్సిపల్ పరిధి, తాండూరు మండలానికి సంబంధించిన లబ్దిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా 120 మంది లబ్దిదారులకు రూ. 1కోటి 20 లక్షల 13వేల 920ల విలువైన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. పేదింటి పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలు అండగా నిలుస్తున్నాయన్నారు. ఈ పథకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, నాయకులు ఉత్తమ్ చంద్, డా. సంపత్ కుమార్, తహసీల్దార్ తారాసింగ్, ఎంపీడీఓ విశ్వప్రసాద్, మున్సిపల్ కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, బొంబీనా, మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్, ఏఎంసీ డైరెక్టర్లు ఉదయ్ భాస్కర్, జర్నప్ప, నేతలు పండరి, హబీబ్ లాల తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

