జూబ్లీ గెలుపు.. ప్రజా పాలనకు తీర్పు

తాండూరు రాజకీయం వికారాబాద్

జూబ్లీ గెలుపు.. ప్రజా పాలనకు తీర్పు
– ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– తాండూరులో పార్టీ శ్రేణుల సంబరాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రజా పాలనకు తీర్పుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు నిలుస్తోందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, శ్రేణులు ఉత్సహాంగా సంబరాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున టపాసులు పేల్చారు. ఎమ్మెల్యేతో పాటు నేతలు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని సంతోషం వ్యక్తం చేశారు.
kvcs
అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనతోనే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు పార్టీ అభ్యర్థి గెలుపుకు పట్టం కట్టారని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, వివిధ మండలాల, గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం