గ‌ణేష్ ల‌డ్డూ.. రికార్డు బ్రేక్..!

తాండూరు వికారాబాద్

గ‌ణేష్ ల‌డ్డూ.. రికార్డు బ్రేక్..!
– రూ. 2.61ల‌కు కైవ‌సం చేసుకున్న‌రొంప‌ల్లి సంతోష్ కుమార్
– రూ. 36,500ల‌కు మ‌రో ల‌డ్డు సొంతం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరులో వినాయ‌కుని ల‌డ్డూ వేలం రికార్డును టీఆర్ఎస్ యువ‌నాయ‌కులు, సామాజిక సేవాక‌ర్త రొంప‌ల్లి సంతోష్ కుమార్ బ్రేక్ చేశారు. ఆదివారం జ‌రిగిన వినాయ‌క నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా నిర్వ‌హించిన ల‌డ్డూల వేలంలో రూ. 2ల‌క్ష‌ల 55 వేలు రికార్డులో ఉండ‌గా దానికి మించి అత్య‌ధిక ధ‌రతో రొంప‌ల్లి సంతోష్ కుమార్ వినాయ‌కుని ల‌డ్డూను సొంతం చేసుకున్నారు. ప‌ట్ట‌ణంలోని కుమార్ షాపింగ్ మాల్ క‌న్యాపాఠ‌శాల స‌మీపంలో ప్ర‌తిష్టించిన వినాయ‌కుని ల‌డ్డూ వేలంలో రొంప‌ల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ వేలం పాట‌లో వినాయ‌కుని ల‌డ్డ‌ను అత్య‌ధికంగా రూ. 2ల‌క్ష‌ల 61వేల‌కు ద‌క్కించుకున్నారు.

అదేవిధంగా ప‌ట్ట‌ణంలోని బ‌స‌వ‌ణ్ణ క‌ట్ట వ‌ద్ద ప్ర‌తిష్టించిన వినాయ‌కుని ల‌డ్డును కూడ రూ. 36వేల 500ల‌కు కైవ‌సం చేసుకున్నారు. దీంతో తాండూరులో అత్య‌ధిక ధ‌ర‌కు ల‌డ్డును సొంతం చేసుకున్న రికార్డును రొంప‌ల్లి సంతోష్ కుమార్ బ్రేక్ చేశారు.