మున్సిపల్ చట్టంలో మార్పులు
– అవిశ్వాస మేయర్, చైర్ పర్సన్‌లకు ఊరట
– నాలుగేళ్ల తరువాత అవిశ్వాస తీర్మానాలు
– శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టిన సర్కారు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: మున్సిపల్ చట్టంలో తెలంగాణ సర్కారు స్వల్ప మార్పులు చేయనుంది. ఈ మేరకు శాసనసభలో బిల్లును ప్రవేశ పెట్టింది. అవిశ్వాస ముప్పును ఎదుర్కొనే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్‌లకు ఈ బిల్లుతో ఊరట కల్పించబోతోంది. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అవిశ్వాసానికి నాలుగేళ్ల కాల పరిమితి విధిస్తున్నట్లుగా పేర్కొంది. నాలుగేళ్ల పదవి కాలం తర్వాతే అవిశ్వాస తీర్మానం పెట్టేలా మార్పులు చేయబోతోంది. మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసానికి నాలుగేళ్ల తర్వాతే అవకాశం కల్పించబోతుంది. అదేవిధంగా చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ లపై అవిశ్వాసానికి కూడా నాలుగేళ్ల తర్వాతే అవకాశం ఉండేలా చర్యలు చేపట్టబోతుంది. దీంతో పాటు కోఆప్షన్ స్థానాల సంఖ్యలను కూడ పెంచబోతోంది.


