బీసీ సంఘం జిల్లా అధ్యక్షురాలుగా మధులతా శ్రీనివాస్ చారి
– జాతీయ అధ్యక్షులు ఆర్ .కృష్ణయ్య చేతుల మీదుగా నియామకం
తాండూరు, దర్శిని ప్రతినిధి: బీసీ సంక్షేమ సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షురాలుగా పెద్దేముల్ మండల వైస్ ఎంపీపీ మధులతా శ్రీనివాస్ చారి నియామకం అయ్యారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ .కృష్ణయ్య చేతుల మీదుగా ఆమె నియామకపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా మహిళ అధ్యక్షురాలుగా నియమించడం పట్ల జాతీయ అధ్యక్షులు ఆర్ .కృష్ణయ్య, జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, రాష్ట్ర కన్వినర్ లాల్ కృష్ణప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, జిల్లా అధ్యక్షులు యాదగిరి యాదవ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు తాండూరుకు చెందిన మహిళకు వికారాబాద్ జిల్లా అధ్యక్షురాలు పదవిని కట్టబెట్టడంపై జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.



