కార్పెంటర్ వెల్పేర్ అసోసియేషన్ నూత‌న అధ్యక్షులుగా ఈర్షాద్

తాండూరు రాజకీయం వికారాబాద్

కార్పెంటర్ వెల్పేర్ అసోసియేషన్ నూత‌న అధ్యక్షులుగా ఈర్షాద్
– ఉపాధ్య‌క్షులు, ప్రధాన కార్య‌ద‌ర్శుల ఎన్నిక
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గ కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూత‌న‌ అధ్యక్షులుగా యువనాయకులు ఈర్షాద్ ఎన్నికయ్యారు. గురువారం తాండూరు అసోసియేషన్ కార్యాలయంలో సభ్యులు ఈర్షాద్‌ను నియోజవకర్గ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా రఘుచారి, ప్రధాన కార్యదర్శిగా రహీంలను ఎన్నుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఈర్షాద్ మాట్లాడుతూ తాండూరు కార్పెంట‌ర్ల అభివృద్ధికి కృషి చేస్తాన‌ని అన్నారు. అంద‌రికి అందుబాటులో ఉంటూ వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పాటుప‌డ‌తాన‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు పురేందర చారి, మాజీ ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్, సభ్యులుపాండురంగా చారి, ఇస్మాయిల్, కాలప్ప తదితరులు పాల్గొన్నారు.