రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్‌ స్టేషన్లు

కెరీర్ తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్‌ స్టేషన్లు
– ఆ నియోజకవర్గాలలో 382 ఉద్యోగాలు
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాలో కొత్తగా 15 ఫైర్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేయడంతో పాటు అందులో 382 ఉద్యోగాలను మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్ జీ.ఓ. ఎం.ఎస్ నెంబర్ 64 ను ద్వారా ఉత్తర్వులను జారీ చేశారు. అగ్ని ప్రమాదాల నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఫైర్ స్టేషన్లు లేని శాసన సభ నియోజక వర్గాల్లో ఈ కొత్త ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, జనగామ, మహబూబాబాద్, మెదక్, సిద్దిపేట, నాగర్‌ కర్నూల్, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నియోజక వర్గాల్లో ఈ కొత్త పదిహేను ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతోంది. అదేవిధంగా ఆయా ఫైర్ స్టేషన్లలో 382 పోస్టులను కూడా మంజూరు చేస్తూ జీ.ఓ. ఎం.ఎస్ నెంబర్ 64 ను రాష్ట్ర ప్రభుత్వం ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ద్వారా ఉత్తర్వులు జారీచేయించింది. అయితే మంజూరైన 382 పోస్టుల్లో 367 రెగ్యులర్ పోస్టులు కాగా, 15 పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ కూడ ఇచ్చారు.

నియోజక వర్గాల వారీగా కొత్తగా ఏర్పాటయ్యే ఫైర్ స్టేషన్లు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా – మల్కాజిగిరి.
రంగారెడ్డి జిల్లా – ఎల్.బి.నగర్, రాజేంద్రనగర్, షాద్ నగర్,
హైదరాబాద్ జిల్లా – అంబర్ పెట్, చాంద్రాయణ గుట్ట, జూబ్లీ హిల్స్
జనగామ – స్టేషన్ ఘనపూర్
మహబూబాబాద్ – డోర్నకల్
మెదక్ – నర్సాపూర్
సిద్ధిపేట – హుస్నాబాద్
నాగర్ కర్నూల్ – కల్వకుర్తి
నిజామాబాద్ – బాల్కొండ
జగిత్యాల – ధర్మపురి
భద్రాద్రి కొత్తగూడెం – పినపాక