పంచాయతీ కార్యదర్శుల సంఘం ఎన్నిక
– తాండూరు మండల అధ్యక్షులుగా లాలప్ప
– కార్యవర్గ సభ్యులుగా పంచాయతీ కార్యదర్శులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం ఎన్నిక జరిగింది. బుధవారం ఎన్నుకున్న సంఘం మండల గౌరవాధ్యక్షులుగా ఎండి ఇస్మాయిల్, అధ్యక్షులుగా జీ.లాలప్ప, ప్రధాన కార్యదర్శులుగా పి. ఆనంద్ రావు, ఉపాధ్యక్షులుగా బి. అమరేశ్వరి, ఫకిరోజీ, కోశాధికారిగా ఆర్.అశోక్, ప్రచార కార్యదర్శిగా బాలకృష్ణలు ఎన్నికయ్యారు. అదేవిధంగా కార్యవర్గ సభ్యులుగా ప్రవీణ, కిష్టప్ప, విశ్వనాథం, జయమ్మ, బాలరాజు, రాములు, సత్యనారాయణ రెడ్డి, కరుణాకర్ రెడ్డిలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంఘం నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించడానికి ప్రాధాన్యమిస్తామన్నారు.

