వైశ్య ఫెడరేషన్ సేవలు అసమానం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

వైశ్య ఫెడరేషన్ సేవలు అసమానం..!
– అంబలితో పేదల ఆకలి తీర్చడం అభినందనీయం
– చేవేళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– రొంపల్లి సంతోష్‌ను అభినందించిన ఎంపీ, ఎమ్మెల్సీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: సామాజిక సేవలలో వైశ్య ఫెడరేషన్ ద్వారా అందిస్తున్న సేవలు అసమానంగా నిలుస్తున్నాయని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిలు అన్నారు. మంగళవారం రాత్రి తాండూరుకు వచ్చిన ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిలు వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర యూత్‌ సెక్రటరీ రొంపల్లి సంతోష్‌ కుమార్ గుప్త నివాసానికి వచ్చారు.

ఈ సందర్భంగా వైశ్య ఫెడరేషన్‌ ద్వారా రొంపల్లి సంతోష్‌ కుమార్, బృందం చేస్తున్న సేవలను అభింనందించారు. ఈ వేసవిలో వైశ్య ఫెడరేషన్ ద్వారా పేదల ఆకలిని తీర్చేందుకు ఉచితంగా అంబలి, మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ప్రజల మనస్సుల్లో నిలిచేలా సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆదర్శనీయమన్నారు. ఇలాంటి అసమాన సేవా కార్యక్రమాలను మరిన్ని చేపట్టాలని రొంపల్లి సంతోష్ కుమార్‌కు సూచించారు. అనంతరం ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిలు రొంపల్లి సంతోష్‌ కుమార్‌ను సన్మానించారు. అదేవిధంగా రొంపల్లి సంతోష్‌ కుమార్ కూడ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిలను కూడ సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, మాజీ డీపీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బీఆర్ఎస్ నాయకులు సాయిపూర్ బాల్‌రెడ్డి, యువనాయకులు బిర్కడ్ రఘు, వైశ్య ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.