జిల్లాలో ఎస్ఐలకు స్థాన చలనం
– 5 మంది ఎస్ఐల బదిలీ
– ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలో పలువురు ఎస్ఐలకు స్థానచలనం కలిగింది. ఐదు మంది ఎస్ఐలను వివిధ పోలీస్టేషన్‌లకు బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని తాండూరు పట్టణ ఎస్ఐ వేణు గోపాల్ గౌడ్ బషీరాబాద్ పోలీస్టేషన్‌కు, బషీరాబాద్ ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి పెద్దేముల్ పోలీస్టేషన్‌కు బదిలీ అయ్యారు. తాండూరు పట్టణ ఎస్ఐగా అబ్దుల్ రవూఫ్ నియామకం అయ్యారు. దీంతో పాటు చెన్గోముల్ ఎస్ఐగా గిరి, కుల్కచర్ల ఎస్ఐగా శ్రీశైలంలను బదిలీ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇది కూడా చదవండి…
స్కూల్లో బ్రేక్ ఫాస్ట్..!
– సర్కారు బడులలో అమలు
– వచ్చే ఏడాది నుంచి కొత్త మెను
https://dharshininews.com/17189


