క్రీడా ప్రాంగణంపై కన్నెశారు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

క్రీడా ప్రాంగణంపై కన్నెశారు..!
– స్థలంలో కంచెల ఏర్పాటు
– ప్రజా ప్రతినిధులతో ప్రమేయంతో అప్రమత్తం
– హద్దులను తొలగించిన అధికారులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం గ్రామానికి కేటాయించిన క్రీడా ప్రాంగణం స్థలంపై అక్రమార్కులు కన్నెశారు. తమ స్థలమంటూ కంచెలతో హద్దులు ఏర్పాటు చేసుకున్నారు. స్థాని ప్రజా ప్రతినిధులతో ప్రమేయంతో విషయం తెలుసుకున్న అధికారులు హద్దులను తొలగించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు అంతారం గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వేనెంబర్ 154 లోని 20 గుంటల భూమిలో క్రీడా ప్రాంగణంకు స్థలం కేటాయించారు. ఈ స్థలంలో అధికారులు హరితహారం మొక్కల కోసం నర్సరీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇదే స్థలంలో గతంలో గుర్తుతెలియని వ్యక్తులు ప్లాట్లు చేసి కొందరికి విక్రయించారు. ఆ తరువాత ప్లాట్ల విక్రయాలలో మోసం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు.

ఆనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రీడా ప్రాంగణంకు స్థలం కేటాయించారు. ప్రస్తుతం గుర్తుతెలియని వ్యక్తులు మళ్లీ తమ ప్లాట్లు ఉన్నాయని. రాళ్లు పాతుకుని కంచెలతో హద్దులు ఏర్పరుచుకుని కబ్జాకు పాల్పడ్డారు. ఈ విషయం తెలిసిన గ్రామ ఎంపీటీసీ శాంతుకు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు వడ్డె శ్యామల, రాజేందర్ రెడ్డి, కుర్వ మల్లేశ్వరీ, లక్ష్మమ్మ, జంగని నర్సమ్మ, ముడుగుల పద్మమ్మ గ్రామ కార్యదర్శి ఇస్మాయిల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆదివారం గ్రామ కార్యదర్శి ఇస్మాయిల్ క్రీడా ప్రాంగణ స్థలం వద్దకు చేరుకుని కంచెతో ఏర్పాటు చేసిన కంచెలను తొలగింపు చేశారు. మరోవైపు క్రీడా ప్రాంగణం స్థలంను రక్షించకపోతే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని, దర్నా కూడా చేస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage