అర్హులంద‌రికి టీకాలు వేయించాలి

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

అర్హులంద‌రికి టీకాలు వేయించాలి
– వ్యాక్సీనేష‌న్ వంద‌శాతం పూర్తే ల‌క్ష్యం
– వికారాబాద్ జిల్లా వైద్యాధికారి డా.తుకారాం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : అర్హులంద‌రికి కొవిడ్ టీకాలు వేయించాల‌ని వికారాబాద్ జిల్లా వైద్యాధికారి డా.తుకారాం పేర్కొన్నారు. శ‌నివారం తాండూరు ప‌ట్ట‌ణంలో కొన‌సాగున్న ఇంటింటికి వ్యాక్సీనేష‌న్ స్పెష‌ల్ డ్రైవ్‌ను జిల్లా వైద్యాధికారి డా.తుకారం తాండూరు ఆర్డీఓ అశోక్‌కుమార్‌తో క‌లిసి ప‌ట్ట‌ణంలోని సాయిపూర్, మ‌ల్‌రెడ్డిప‌ల్లి, ఇందిరాన‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లో ప‌ర్య‌టించి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా వైద్యాధికారి డా.తుకారాం మాట్లాడుతూ వ్యాక్సీనేష‌న్ స్పెష‌ల్ డ్రైవ్‌ను వంద శాతం పూర్తి చేసేలా ప‌నిచేయాల‌న్నారు. ప్ర‌తి వార్డులో 18 ఏండ్లు నిండిన అర్హులంద‌రికి టీకాలు వేయించాల‌న్నారు. వైద్య సిబ్బంది మున్సిప‌ల్, రెవెన్యూ, అంగన్‌వాడి, ఆశా వ‌ర్క‌ర్ల‌తో క‌లిసి స‌మ‌న్వ‌యంతో వ్యాక్సీనేషన్‌ను పూర్తి చేయాల‌న్నారు. ఆయ‌న వెంట హెల్త్ సూప‌ర్ వైజ‌ర్లు అంబిక‌, వెంక‌టేష్‌, మెడిక‌ల్ ఆఫీస‌ర్లు డా.బాస్క‌ర్, డా.కిషోర్, యూడీసీ రాజేశ్వ‌రీ త‌దిత‌రులు ఉన్నారు.