ఓటరు జాబితాకు సహకరించాలి
– తప్పులు లేకుండా రూపకల్పకనకు చర్యలు
– తాండూరు తహసీల్దార్ తారాసింగ్
– రాజకీయ పార్టీల నేతలతో సమావేశం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఎన్నికల ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని తాండూరు తహసీల్దార్ తారాసింగ్ అన్నారు. బుధవారం తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇతర రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు ఓటరు జాబితాపై పలు సలహాలు, సూచనలు అందజేశారు. అనంతరం తహసీల్దార్ తారాసింగ్ మాట్లాడుతూ ఎన్నికల ఓటరు జాబితా తప్పులు లేకుండా
లెదా కొత్త జాబితా తయారు చేసేందుకు నేతలు సహకరించాలన్నారు.

అందరి సహాకారంతో ఎలాంటి తప్పులు లేకుండా ఓటరు జాబితాను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ లలిత, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

