ఎమ్మెల్సీల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన కేపీఆర్

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

ఎమ్మెల్సీల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన కేపీఆర్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, శంభీపూర్ రాజుల‌కు టీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కులు, యాలాల మాజీ ఎంపీపీ క‌ర‌ణం ఫురుషోత్తం రావు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌స్తుత ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో నామినేష‌న్ వేసి ఏక‌గ్రీవంగా ఎన్నికైన సంద‌ర్భంగా క‌రణం పురుషోత్తం రావు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. బుధ‌వారం ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, శంభీపూర్ రాజుల‌ను క‌లిసి పుష్ప‌గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో కోడంగ‌ల్ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయ‌కులు త‌దిత‌రులు ఉన్నారు.