పంచాయతి ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

పంచాయతి ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
– నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి తప్పులు చేయొద్దు
– అభ్యర్థుల పత్రాల సమర్పణపై అవగాహన కల్పించాలి.
– వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
– పెద్దేముల్, యాలాల మండలాల్లోని క్లస్టర్ల పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : పంచాయతి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని, నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.

శుక్రవారం తాండూరు నియోజకవర్గం పెద్దేముల్, యాలాల మండలాల్లోని పంచాయతీ ఎన్నికల క్లస్టర్లను సందర్శించారు. ఆయా కేంద్రాలలో అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి తప్పులు, పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసే క్రమంలో అభ్యర్థుల నుంచి కావాల్సిన పత్రాలను సమర్పించేలా అవగాహన కల్పించాలన్నారు.

నామినేషన్ల పత్రాలు స్పష్టంగా పరిశీలించుకునేలా అభ్యర్థులకు సహకరించాలని అన్నారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు తీసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అభ్యర్థుల బ్యాంకు ఖాతా ఉండేలా చూసుకోవాలన్నారు. సర్పంచులు, వార్డు సభ్యులు నిబంధనలకు అనుగుణంగా ఖర్చులు పెట్టాలనే విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల సమయానికి అవసరానికి అనుగుణంగా సిబ్బందిని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు రతన్ సింగ్, శ్రీనిజ, ఆర, ఏఆర్ఓలు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ఎన్నికలు లేకుండా గెలిపించండి..!