తాండూరును ముంచేసిన మంచు
– రోడ్లు, వీదులు దట్టమయం
– ఇబ్బందులు పడ్డ వాహనదారులు
తాండూరు, దర్శని ప్రతినిధి: తాండూరును మంచు ముంచేసింది. పోగ లాగ దట్టంగా కమ్మేసింది. శుక్రవారం తెల్లవారు జాము భోగి రోజు మంచు వాతావారణం నెలకొంది. దాదాపు గంటన్నర పాటు ఈ పొగమంచు వదల్లేదు. పట్టణంలోని కాలనీలు, వీదులలో మంచు నిండుకుపోయింది. ఎదురుగా ఎవరొస్తున్నారనేది కూడ తెలియకుండా పోయింది. ఇక ప్రధాన రోడ్లపై కూడ ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో లారీలు, బస్సలు లాంటి పెద్ద వాహనాలతో పాటు బైకులు, స్కూటీలు నడిపే వాహదారులు సైతం ప్రయాణాలకు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని ప్రధాన రహదారులు అయిన కోడంగల్, చించొల్లి రోడ్డు, విలియమూన్ – అంతారం, హైదరాబాద్ రోడ్డు పూర్తిగా పొగ మంచుతో కమ్ముకుపోయాయి.
ఎదురుగా ఏ వాహనాలు వస్తున్నాయో కూడ తెలియకుండా పోయింది. ఆయా వాహనదారులు వెలుగులోనే లైట్లను వేసుకుని ప్రయాణించడం కనిపించింది. మరోవైపు పట్టణంలోని వీధుల్లో ప్రజలు కురుస్తున్న మంచుతో సంతోషం వ్యక్తం చేశారు. దట్టమైన మంచులో సెల్ ఫోన్లతో సెల్పీలు తీసుకుని సందడి చేశారు.

