బీసీ సంక్షేమ శాఖ‌కు రూ. 870 కోట్లు

తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

బీసీ సంక్షేమ శాఖ‌కు రూ. 870 కోట్లు
– ఉత్త‌ర్వులు జారీ చేసిన‌ స‌ర్కారు
– క‌ళ్యాణ ల‌క్ష్మీకి రూ. 462 కోట్లు
– బీసీ స్కాల‌ర్ షిఫ్‌ల కోసం రూ. 325 కోట్లు
– గురుకులాల‌కు రూ. 82 కోట్లు
ద‌ర్శిని డెస్క్: తెలంగాణ ప్ర‌భుత్వం బీసీ సంక్షేమ శాఖ‌కు భారీ ఎత్తున నిధుల‌ను విడుద‌ల చేసింది. రూ. 870 కోట్ల‌ను విడుద‌ల చేసింద‌ని బీసీ వెల్పేర్ సెక్ర‌ట‌రి వెంక‌టేశం ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో క‌ళ్యాణ‌ల‌క్ష్మీకి ప‌థ‌కానికి అధికంగా నిధులు విడుద‌ల చేసింది. తెలంగాణ ప్ర‌భుత్వం క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, షాదీముభార‌క్ ప‌థ‌కాల‌కు బ‌డ్జెట్ల్‌లో ప్రాధాన్య‌త క‌ల్పించిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ ప‌థ‌కం కింద రూ. 462.50 కోట్ల‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అదేవిధంగా బీసీ స్కాల‌ర్ షిఫ్‌ల కోసం మ‌రో రూ. 325.15 కోట్ల‌ను మంజూరు చేసింది. దీంతో పాటు 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రం కింద గురుకుల విద్యాసంస్థ‌ల సోసైటికి రూ. 165 కోట్ల బ‌డ్జెట్‌ను కేటాయించింది. ఈ మేర‌కు త్రైమాసానికి సంబంధించి గురుకుల పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల నిర్వ‌హ‌ణ కోసం రూ. 82.84 కోట్ల‌ను కేటాయించింది. బీసీ క‌మీష‌న్ కింద నిధులు మంజూరు కావ‌డంపై ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.