చిక్కిన హైనా..!

క్రైం తాండూరు రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

చిక్కిన హైనా..!
– బంధించిన హైదరాబాద్ జూ పార్కు రిస్క్యూ టీం
తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : ప్ర‌జ‌ల‌ను హ‌డ‌లెత్తించిన హైనాను ఎట్ట‌కేల‌కు బంధించారు. వన్య ప్రాణుల ర‌క్ష‌ణ‌లో భాగంగా బంధించిన హైనాను హైద‌రాబాద్‌లోని జూ పార్కుకు త‌ర‌లించారు. తాండూరు మండలం గోనూర్ గ్రామంలో గ్రామానికి చెందిన సర్పంచ్ కొల్లి గోవింద్ మొక్క జొన్న పొలంలో హైనా సంచారం గ్రామస్తులను భయాందోళకు గురిచేసిన విషయం తెలిసిందే. గ్రామస్తుల ద్వారా షయం తెలుసుకున్న తాండూరు అటవీశాఖ అధికారి శ్యాంసుందర్ రావు హైదరాబాద్ జూ పార్క్ అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు శనివారం. శ్యాంసుందర్ రావు ఆధ్వర్యంలో హైదరాబాద్ జూ పార్కు డిప్యూటీ డైరెక్టర్, జూనియర్ వెటర్నరీ డాక్టర్ హఖీం, షేక్ అబ్దుల్లా బృందం గ్రామానికి చేరుకున్నారు. ప్రత్యేక బోనులో హైనాను బంధించారు. అక్కడి నుంచి దానిని హైదరాబాద్ లోని జూ పార్కుకు తరలించారు. హైనాను బంధించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు. తెలిపారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారి శ్యాంసుందర్ రావు మాట్లాడుతూ ఆటవి జంతువులు ఆహారం కోసం ఎక్కడి నుంచో వస్తుంటాయని, వాటికి ఏమాత్రం హాని చేయకుండా అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.