బీసీ కమీషన్ చైర్మన్‌ను సన్మానించిన రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకులభరణం కృష్ణ మోహన్‌రావును బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ సన్మానించారు. రాష్ట్ర బీసీ కమీషన్ చైర్మన్‌గా వకులభరణం కృష్ణ మోహన్‌రావును నియమించడంపట్ల గురువారం ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తాండూరులోని నాపరాతి కార్మికులను ఆదుకునేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ శుకూర్, యాలాల్ మండల్ అధ్యక్షులు లక్మణచారి, కనకయ్య, రాము ముదిరాజ్, రాజు తదితరులు ఉన్నారు.

