రక్షణ శాఖ పెన్షనర్లకు తీపి కబురు
– జీవణ ప్రమాణ పత్రం సమర్పణకు గడువు పెంపు
దర్శిని డెస్క్ : కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖకు చెందిన పెన్షనర్లకు తీపి కబురు చెప్పింది. వారి వార్షిక జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించే గడవును మరో నెల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 25తో పూర్తయిన గడువును వచ్చే జూన్ 25 వరకు పొడగించింది. దీంతో ఈగడువులోగా పెన్షనర్లు తమ వార్షిక ధ్రువీకరణ, జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించవచ్చు. స్పర్ష్‌లోకి మారిన 34,636 మంది పెన్షనర్లు ఇంకా తమ వార్షిక ధ్రువీకరణను చేపట్టలేదు. మే 17 వరకు 2021 నుంచి పత్రాలు 43,774 పెన్షనర్లవి పెండింగ్‌లో ఉన్నాయి. ఆన్లైన్లో గానీ, సంబంధిత బ్యాంకుల ద్వారా గానీ ఈ ప్రక్రియను పూర్తి చేయలేదని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ పెన్షనర్లకు మరో నెల రోజుల పాటు గడువును పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
దరఖాస్తు ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోండిలా..
పెన్షనర్ల జీవన ప్రమాణ పత్రాన్ని మీ కంప్యూటర్ లేదా మొబైల్లో జీవన ప్రమాణ్ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా పూర్తి చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. దీనికోసం https://jeevanpramaan.gov.in portal నుంచి దరఖాస్తు ఫామ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. పెన్షనర్లు https://jeevanpramaan.gov.in/ppouser/login వెళ్లి కూడా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దీంతో పాటు పెన్షనర్లు తమ జీవన ప్రమాణ పత్రాలను కామన్ సర్వీస్ సెంటర్‌లోకి వెళ్లి కూడ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చని సూచించింది.
పెన్షన్ పొందాలంటే వార్షిక ధృవీకరణ తప్పనిసరి
పెన్షనర్లు ప్రతి నెల పెన్షన్ పొందాలంటే ఈ వార్షిక దృవీకరణ తప్పనిసరి. స్పర్ష్ సిస్టమ్ ద్వారా ఎలాంటి ఎక్స్‌టర్నల్ ఇంటర్మీడియరీ అవసరం లేకుండా రక్షణ శాఖలో పనిచేసిన మాజీ ఉద్యోగుల అకౌంట్లలోకి నేరుగా పెన్షన్ క్రెడిట్ చేస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం రక్షణ శాఖు చెందిన 33 లక్షల మందికి పైగా పెన్షనర్లు ఉంటే.. వారిలో 5 లక్షల మంది ఈ కొత్త విధానంలోకి మారారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ మైగ్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది.
కింది వరకు చూడండి…


