శభాష్ చేతన్ రెడ్డి..!
– రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలలో సిల్వర్ మెడల్
తాండూరు, దర్శిని ప్రతినిధి: శభాష్ చేతన్ రెడ్డి అని తాండూరు విద్యార్థిని ఫ్రంట్‌లైన్ ది స్కూల్ యజమాన్యం అభినందించింది. స్కూల్‌లో చదువుతున్న పి.చేతన్ రెడ్డి హైదరాబాద్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 3వ తెలంగాణ తైక్వాండో ఛాంపియన్ షిఫ్‌లో సత్తా చాటాడాడు. ఈ పోటీలో చేతన్ రెడ్డి సిల్వర్ మెడల్ సాధించాడు. ఈ సందర్బంగా స్కూల్ కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి చేతన్ రెడ్డిని శభాష్ అంటూ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తైక్వాండో సాధనతో శారీరక దృఢత్వం పాటు మానసిక దృడత్వాని పెంపొందించుకోవచ్చని అన్నారు. విద్యార్థులు చదువలతో పాటు క్రీడాలలో రాణించాలన్నారు. విద్యార్థుల ఆసక్తిని గమనించి వారి తల్లిదండ్రులు కూడ క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు.


