ఇంట‌ర్ ఇంగ్లీష్ సిల‌బ‌స్ చేంజ్

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

ఇంట‌ర్ ఇంగ్లీష్ సిల‌బ‌స్ చేంజ్
– కొత్త పుస్త‌కాల‌ను ఆవిష్క‌రించిన మంత్రి స‌బితా
– ఎప్ప‌టి నుంచి ప్రారంభ‌మంటే
హైదరాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణలోని ఇంట‌ర్ విద్యావిధానంలో కీల‌క మార్పు జ‌రిగింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్‌ సబ్జెక్టు సిలబస్‌ను చేంజ్ చేసింది ఇంటర్‌ బోర్డు. ఇంటర్ రెండో సంవత్సరానికి ఈ ఏడాది నుంచి కొత్త ఇంగ్లిష్ పాఠ్యాంశాల‌ను తెర‌పైకి తెచ్చింది. ఇందులో భాగంగా గురువారం కొత్త ఇంగ్లీష్ పుస్త‌కాల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శి ఉమ‌ర్ జ‌లీల్ మాట్లాడుతూ.. ఈ ఏడాది నుంచి కొత్త సిల‌బ‌స్‌తో ఇంగ్లీష్ పుస్త‌కాల‌ను ముద్రించామ‌ని తెలిపారు. ఈ కొత్త పుస్త‌కాలు త్వ‌ర‌లోనే మార్కెట్‌లోకి వ‌స్తాయ‌ని చెప్పారు. ఫెయిలైన విద్యార్థుల‌కు పాత సిల‌బ‌స్ ప్ర‌కార‌మే ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని జ‌లీల్ స్ప‌ష్టం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో విద్యా శాఖ‌, ఇంట‌ర్ బోర్డు అధికారులు పాల్గొన్నారు.