ఎస్బీఐ ఖాతా దారులకు బంపర్‌ ఆఫర్

జాతీయం టెక్నాలజీ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

ఎస్బీఐ ఖాతా దారులకు బంపర్‌ ఆఫర్
– బ్యాంకుకు వెళ్లకుండానే రూ. 8 లక్షల రుణం
– అకౌంట్లో ఎలా జమ అవుతాయంటే
దర్శిని డెస్క్‌: దేశంలోనే భారీ ఖాతా దారులకు కలిగి ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. డబ్బులు అవసరమయ్యే ఖాతాదారులకు ఇన్‌స్టంట్ ఫ్రీ అప్రూవ్డ్‌ రుణాలు అందించనుంది. ఇందుకోసం ఖాతాదారులకు బ్యాంకు వెళ్లాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. మరి ఇంతకీ ఈ రుణాలను ఎలా సొంతం చేసుకోవాలని ఆరాట పడుతున్నారా.. అయితే మరిన్ని వివరాలను కింద తెలుసుకోండి.

ఎస్‌బీఐ బ్యాంకు ట్విట్టర్ వేదికగా ఖాతాదారులకు బ్యాంక్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లోనే ప్రి అప్రూవ్డ్ లోన్ అందిస్తున్నట్లు ప్రకటించింది. రూ. 8 లక్షల దాకా పొందొచ్చని తెలిపింది. అర్హత కలిగిన కస్టమర్లు పర్సనల్ లోన్స్ కింద బ్యాంక్ నుంచి రూ. 35 లక్షల వరకు రుణం పొందొచ్చని తెలియజేసింది. ఎస్‌బీఐ యోనో లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కలిగిన ఖాతాదారులు ఆ వ్యవస్థ ద్వారా ఈ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. లోన్‌ కోసం ఎస్‌బీఐ కస్టమర్లు పీఏపీఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఎస్‌బీఐ అకౌంట్ చివరి నాలుగు అంకెలు ఎంటర్ చేసి 567676 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపిస్తే సరిపోతుంది. మీకు రుణ అర్హత ఉందా? లేదా? అనే విషయం తెలిసిపోతుంది.

ప్రిఅప్రూవ్డ్ లోన్ ఆఫర్ ఉందా? లేదా? అనే విషయాన్ని ఎస్‌బీఐ యోనో యాప్ద్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. దీని కోసం ఎస్‌బీఐ యోనో యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. ఇందులో మీకు ప్రిఅప్రూవ్డ్ లోన్ ఆఫర్ ఉంటే కనిపిస్తుంది. లేదంటే లేదు.

ఒకవేళ ప్రిఅప్రూవ్డ్ లోన్ ఆఫర్ ఉంటే.. దీనిపై క్లిక్ చేయాలి. ఎంత లోన్ అవసరమో ఎంచుకోవాలి. అలాగే టెన్యూర్ ఎంపిక చేసుకోవాలి. ఇంకా వడ్డీ రేటు, ఈఎంఐ వంటి అంశాలను చెక్ చేసుకోవాలి. తర్వాత కంటిన్యూ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేయాలి. అంతే డబ్బులు మీ అకౌంట్‌లోకి వచ్చేస్తాయి.

లోన్ డబ్బులు వచ్చిన తర్వాత ప్రతి నెలా ఈఎంఐ కట్ అవుతూ వస్తుంది. ఎక్కువ టెన్యూర్ ఎంచుకుంటే తక్కువ ఈఎంఐ పడుతుంది. అదే తక్కువ టెన్యూర్ అయితే ఎక్కువ ఈఎంఐ వస్తుంది. ఎక్కువ టెన్యూర్ ఎంచుకుంటే వడ్డీ కూడా ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందని గుర్తించాలి.

యోనో యాప్ ద్వారా రుణం పొందేందుకు అనుస‌రించాల్సిన 4 ద‌శ‌లు..
1. ఎస్‌బీఐ యోనో యాప్‌లోకి లాగిన్ అవ్వండి.
2. డ్రాప్‌-డౌన్ మోనూలోని “అవైల్ నౌ” బ‌ట‌న్‌పై క్లిక్ చేయండి.
3. లోన్ మొత్తం, కాల‌వ్య‌వ‌ధిని ఎంచుకోండి.
4. బ్యాంక్ ఖాతాకు అనుసంధానం చేసిన మొబైల్‌ నంబర్‌కి వచ్చిన‌ ఓటీపీని ఎంట‌ర్ చేస్తే ప్రాసెస్‌ను పూర్తి చేస్తారు. రుణ‌ మొత్తం ఖాతాకు క్రెడిట్ అవుతుంది. కేవ‌లం 4 క్లిక్కుల్లో వ్యక్తిగ‌త రుణానికి సంబంధించి త‌క్ష‌ణ ప్రాసెసింగ్ జ‌రుగుతుంది