ఈ దున్న రేటు అక్షరాల రూ. 25 కోట్లు
– లగ్జరీ కార్ల ధరలనే తలదున్నేసింది
– దీనితో నెలకు రూ. 9.60 లక్షల ఆధాయం
– ఆ వ్యాపారం తెలిస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం
దర్శిని డెస్క్: అత్యంత ప్రసిద్ది చెందిన లగ్జరీ కార్ల ధరలను తలదన్నేసింది ఓ దున్నపోటు రేటు. ముర్రుజాతికి చెందిన ఈ దున్నపోతు ధర అక్షరాల రూ. 25 కోట్లు. హర్యానాలోని పానీపాత్ జిల్లా దిడ్వాడి గ్రామానికి చెందిన నరేంద్ర సింగ్ అనే రైతు ముర్రజాతి దున్నపోతును పెంచుకొంటున్నాడు.దానికి షెహన్షా అనే పేరు పెట్టాడు. ప్రస్తుతం దీని వయసు పదేళ్లు. 15 అడుగుల పొడవు..ఆరడగుల ఎత్తుతో ఉంటుంది. కానీ ఈ దున్నపోతు ధర అక్షరాల రూ.25 కోట్లు. ఓ వైపు వినడానికి షాకింగ్‌గా ఉన్న ఈ ధర పలుకున్న దున్నపోతుతో చేస్తున్న వ్యాపారం వింటే అంతే షాక్‌కు గురికాక తప్పదు. ఈ జాతి దున్నల వీర్యానికి మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది.
ప్రస్తుతం నరేంద్రసింగ్ వద్ద ఉంటున్న షెహన్బాషా వీర్యాన్ని నెలలో నాలుగుసార్లు బయటకు తీస్తారు. ఆ వీర్యంతో దాదాపు 800 డోసులను తయారు చేస్తారు. దీన్ని వేరు చేసే ప్రక్రియలో ప్రతి డోసుకు రూ.300 వరకు ఖర్చవుతుంది. ఆ తర్వాత వీటిని మార్కెట్లో విక్రయించి నరేంద్రసింగ్ నెలకు రూ.9.60 లక్షలు సంపాదిస్తున్నారు. అందుకే ఈ ముర్రాజాతి దున్నలను హర్యాణాలో నల్ల బంగారం అని కూడా పిలుస్తారు. కర్నాల్ నగరం వీటికి ప్రసిద్ధి. నరేంద్రసింగ్ ఈ దున్న కోసం ఓ ప్రత్యేక ఈతకొలను కూడా కట్టించారు. వివిధ పోటీల్లోనూ ఈ దున్న విజేతగా నిలుస్తోంది. అయితే ఓసారి నిర్వహించిన ఛాంపియన్షిప్ పోటిలో పాల్గొని ఏకంగా రూ.30 లక్షలు గెలుచుకుంది.

