స్వచ్ఛత కోసమే స్పెషల్ డ్రైవ్

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

స్వచ్ఛత కోసమే స్పెషల్ డ్రైవ్
– పట్టణ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
– తాండూరు మున్సిపల్ కమీషనర్ షఫీవుల్లా
తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ స్వచ్ఛత కోసం స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తాండూరు మున్సిపల్ కమీషనర్ షఫీవుల్లా అన్నారు. మంగళవారం పట్టణంలోని చౌరస్తా నుంచి విలియం మూన్ చౌరస్తా వరకు స్పెషల్ శానిటేషన్‌ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. కార్మికులతో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ పనులను కమీషనర్ షఫీవుల్లా పరిశీలించారు. పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని కార్మికులకు ఆదేశించారు. రోడ్లు, మురుగు కాలువలు చక్కగా శుభ్రం చేయాలన్నారు. పనులు నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతగా నిర్వహించారు. అనంతరం కమీషనర్ మాట్లాడుతూ తాండూరు పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. వర్షాకాలంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నామన్నారు. కమీషనర్ వెంట మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, శానిటరీ ఇను స్పెక్టర్ ఉన్నారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage