భారత్ సైన్యం చేతికి త్రిశూల్, వజ్ర ఆయుధాలు
– గల్వాల్ ఘటన తరువాత రూపకల్పన
– ఆయుధాల్లో దాగిఉన్న ప్రత్యేకతలు
దర్శని బ్యూరో : ఇప్పటి వరకూ పరమశివుని చేతిలో ఆయుధంగా కనపడిన త్రిశూలం ఇప్పుడిక భారత బలగాల చేతుల్లో ఆయుధంగా మారనుంది. తరచుగా భారత భూభాగంలోకి దూసుకొస్తున్న డ్రాగన్ దళాలకు షాక్ ఇచ్చేందుకు సిద్దమైంది. త్రిశూల్, వజ్ర పేర్లతో ప్రాణహాని కలిగించని ఆయుధాలను భారత సైన్యం తయారు చేయించింది. గల్వాన్ ఘటన తర్వాత భారత్ ఈ ఆయుధాల రూపకల్పన చేసింది. సరిహద్దు ఘర్షణల సమయంలో ప్రాణహాని కలిగించని ఆయుధాలనే వాడాలని ఇరు దేశాల మధ్య ఒప్పందం ఉంది. అందుకనే భారత సైన్యం సరికొత్త ఆయుధాలను తయారు చేయించింది. ఇరు దేశాల మద్య ఉన్న ఒప్పందం భారత సైన్యం సరికొత్త ఆయుధాలను తయారు చేయించింది. వీటిని నోయిడాకు చెందిన అపాస్టెరాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ రెడీ చేసింది. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం.
1. త్రిశూల్
శివుని చేతిలో ఉండే ఆయుధం త్రిశూలం. దీనిని స్ఫూర్తిగా తీసుకొని ‘త్రిశూల్’ ఆయుధాన్ని తయారు చేశారు. ఇది బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. త్రిశూల్ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది. దీనిని తాకిన శత్రు సైనికుడు కొద్ది సెకన్లలోనే షాక్‌కి గురువుతాడు.
2. వజ్ర
ఇది ఒక బ్యాటరీ సాయంతో పనిచేసే ఇనుప కడ్డీ. దీనిపై ముళ్లు ఉంటాయి. విద్యుత్‌ను విడుదల చేయడం ద్వారా ఈ ఆయుధం ఒక వ్యక్తికి షాక్ కలిగిస్తుంది. దీనివల్ల శత్రువు కొద్దిసేపు అపస్మారక స్థితిలోకి వెళుతాడు. శత్రు సైనికుల వాహనాలపై కూడా దాడి చేసేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. దీనిపై ఉండే ముళ్లు వారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాల టైర్లను కూడా పంక్చర్ చేస్తాయి.
3. సప్పర్ పంచ్
చేతికి వేసుకునే గ్లవ్స్ మాదిరిగా ఉంటుంది ఈ ఆయుధం. దీనిని ధరించి శత్రు సైనికుడిని కొడితే షాక్ గురై అపస్మారక స్థితిలోకి వెళుతాడు.
4. దండ్
ఇది బ్యాటరీ సాయంతో పనిచేసే విద్యుత్ కర్ర. ఇది షాక్‌ని కలిగిస్తుంది. ఇది పనిచేయడానికి ఒక సేఫ్టీ స్విచ్ అవసరం. అది విడిగా ఉంటుంది ఒకవేళ శత్రువు దీన్ని లాక్కుని వెళ్లినా దానిని వాడుకోవడం వారికి తెలియదు.
5. భద్ర
ఇది సైనికులకు ఒక రక్షణ కవచం లాంటిది. రాళ్ల దాడుల నంచీ కాపాడటమే కాక, మిరుమిట్లుగొల్పే కాంతిని వెలువరించడం ద్వారా శత్రువుకి కళ్లు కనిపించకుండా చేస్తుంది.
#WATCH 'Trishul' and 'Sapper Punch'- non-lethal weapons-developed by UP-based Apasteron Pvt Ltd to make the enemy temporarily ineffective in case of violent face offs pic.twitter.com/DmniC0TOET
— ANI (@ANI) October 18, 2021

