యాలాల ఎస్ఐగా అరవింద్
– ఎస్పీ కార్యాలయం నుంచి అటాచ్ ఉత్తర్వులు
యాలాల, దర్శిని ప్రతినిధి: యాలాల పోలీస్టేషన్ ఎస్ఐగా అరవింద్ బాధ్యతలు స్వీకరించారు. తాండూరు పట్టణంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న అరవింద్‌ను యాలాల పోలీస్టేషన్‌కు అటాచ్ చేస్తున్నట్లు ఎస్పీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈమేరకు సోమవారం ఎస్ఐ అరవింద్ తాండూరు పట్టణ పోలీస్టేషన్ నుంచి రిలీవ్ అయ్యి యాలాల ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన అరవింద్ గతంలో తన ట్రైనింగ్ పిరియడ్‌ను యాలాల పోలీస్టేషన్‌లో పూర్తి చేశారు. ట్రైనింగ్ చేసిన పోలీస్టేషన్‌లోనే ఎస్ఐగా అరవింద్ బాధ్యతలు చేపట్టారు. మరోవైపు యాలాల పోలీస్టేషన్‌లో ఎస్ఐగా పనిచేసిన శంకర్‌ను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేసిన విషయం తెలిసిందే. యాలాల మండలంలో ఇసుక రవాణాను నియంత్రించడంలో విఫలం కావడం పట్ల ఆయనపై వేటు వేసినట్లు ప్రచారం ఉంది.

