సూప‌ర్ సేవా బాయ్స్

తాండూరు వికారాబాద్

సూప‌ర్ సేవా బాయ్స్
– మంత‌న్‌గౌడ్‌లో బ‌స్టాండ్ ఏర్పాటు
– ప్రారంభించి అభినందించిన ఎస్ఐ విద్యాచ‌ర‌ణ్ రెడ్డి
బ‌షీరాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి : సామాజిక సేవ‌కు పూనుకున్న సేవా బాయ్స్‌ను సూప‌ర్ అంటూ బ‌షీరాబాద్ ఎస్ఐ విద్యాచ‌ర‌ణ్ రెడ్డి అభినందించారు. మండల పరిధిలోని మంతన్ గౌడ్ తాండలో సేవా బాయ్స్ ఆధ్వర్యంలో సొంత ఖ‌ర్చుల‌తో నూతన బస్టాండ్‌ను ఏర్పాటు చేశారు. మంగ‌ళ‌వారం బ‌షీరాబాద్ ఎస్ఐ విద్యాచ‌ర‌ణ్ రెడ్డి ముఖ్యఅతిథిగా బ‌స్టాండ్‌ను ప్రారంభించారు.
ఈ సంద‌ర్భంగా ఎస్ఐ విద్యా చరణ్ రెడ్డి మాట్లాడుతూ యువ‌త‌రం అన్నింట్లో ఆద‌ర్శం కావాల‌నే నినాదాన్ని మంత‌న్‌గౌడ్ తాండాకు చెందిన సేవా బాయ్స్ ఆచ‌రించ‌డం ఆభినంద‌నీయ‌మ‌న్నారు. యువకులు ముందుండి గ్రామంలో మరింత సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. సేవ బాయ్స్ యువకులు ఆద‌ర్శంగా నిల‌వాల‌ని ఆకాంక్షించారు. అదేవిధంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శేషగిరి మాట్లాడుతూ సేవా బాయ్స్ గ్రామంలోని పాఠ‌శాల‌లో గోడ‌ల‌పై బొమ్మ‌లు వేయించ‌డం జ‌రిగింద‌న్నారు. తాజాగా బస్టాండ్ ప్రారంభించడం చాలా సంతోషకరం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాయత్రి బాయి రాము, ఉప సర్పంచ్ ధన్‌సింగ్, ఆర్టీసీ అధికారి రమేష్, రాము డీలర్, హర్యా నాయక్, మాజీ సర్పంచ్ రాము నాయక్, మోహన్, సేవా బాయ్స్ యువకులు వినోద్, వెంకటేష్, అజయ్, దేవేందర్, సంజయ్, గౌతమ్, నాందేవ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.