నిరుద్యోగుల‌కు గ్రూప్‌-1 ఉద్యోగాల పంట‌

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

నిరుద్యోగుల‌కు గ్రూప్‌-1 ఉద్యోగాల పంట‌
– నోఫిటికేష‌న్ జారీ చేసిన తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్
– వచ్చే నెల 2 నుంచి 30వ‌ర‌కు దరఖాస్తుల స్వీక‌ర‌ణ
హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు ఉద్యోగాల పంట‌ను అందిస్తోంది. ఇప్ప‌టికే భారీ ఎత్తున పోలీసు కొలువుల‌ను ప్ర‌కటించిన స‌ర్కారు గ్రూప్‌-1 పోస్టులకు సంబంధించి నోటిఫికేష‌న్ జారీ చేసింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ ద్వారా ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన అనంతరం తొలిసారిగా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇంటర్వ్యూలు లేకుండానే పోస్టులను భర్తీ చేయనున్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను టీఎస్‌పీఎస్సీ స్వీకరించనున్నది. రాష్ట్రంలోని పది ప్రభుత్వ శాఖల్లో ఉన్న 503 పోస్టులను భర్తీ చేయనున్నది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ద్వారా పోస్టులు భర్తీ చేయనున్నారు.

గ్రూప్-1 ద్వారా భ‌ర్తిచేసే పోస్టులు ఇవే..

5 జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పోస్టులు, 40 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు, 38 అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు, 20 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్‌ (పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్), 92 డీఎస్పీ, 2 జైళ్లశాఖలో డీఎస్పీ పోస్టులు, 8 అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌, 2 జిల్లా ఉపాధి అధికారి, 6 జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి పోస్టులు, 35 గ్రేడ్‌-2 మున్సిపల్‌ కమిషనర్‌ పోస్టులు, 121 మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి, 5 జిల్లా పంచాయతీ అధికారి పోస్టులు, 48 సీటీఓ, 42 డిప్యూటీ కలెక్టర్లు, 26 అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, 4 ప్రాంతీయ రవాణా అధికారి పోస్టులు, 2 జిల్లా జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పోస్టులను భ‌ర్తి చేయ‌నుంది.